బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి
కాళేశ్వరం: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాటారం డీఎస్పీ రామ్మోన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మహాదేవపూర్ పోలీస్‌స్టేషన్‌లో బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హింసకు తావు లేకుండా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లింలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పవన్‌కుమార్, మహాదేవపూర్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని
ప్రతిఒక్కరూ కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: పర్యావరణాన్ని ప్రతిఒక్కరూ కాపాడి భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ తెలిపారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ అవగహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తున్నట్లు వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే రానున్న రోజుల్లో మానవాళిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రవణ్‌రావు, విష్ణువర్ధన్‌రావు, శివకుమార్, అక్షయ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
భూపాలపల్లి రూరల్: దేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం సమానత్వం కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపకుండా అతికిరాతకంగా ఎన్‌కౌంటర్ల పేరిట చంపడం దుర్మర్గామన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపి మావోలు జన స్రవంతిలో కలిసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్, వెలిశెట్టి రాజయ్య, నేరేళ్ల జోసెఫ్, మాతంగి రాంచందర్, శేఖర్, లావణ్య, గోమాత, శ్రావణి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
గణపురం: అర్హులైన నిరుపేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, బస్వరాజు పల్లి, జంగుపల్లి, వెంకటేశ్వరపల్లి, ధర్మరావుపేట, నగరంపల్లి, కోండాపూర్, సీతారాంపూర్, అప్పయ్యపల్లి, కర్కపల్లి, మైలారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను హౌసింగ్ పీడీ లోకిలాల్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాలపై పెట్టిన శ్రద్ధ పేదల ఇళ్లపై పెట్టలేదన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. అలాగే మండలంలోని చెల్పూర్ గ్రామంలో జరిగి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి


