అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
● బీజేపీ జిల్లా అధ్యక్షులు బలరాం
ఏటూరునాగారం: అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏటూరునాగారంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్స్‌ను తూచ తప్పకుండా కాపాడుతున్నా ఏకై క పార్టీ బీజేపీయే అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలామంతుల రవీంద్రచారి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ భూక్యా జవహర్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికారప్రతినిధి గుగులోత్ స్వరూప, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రామరాజు, బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బుచ్చయ్య, నాయకులు జనార్ధన్, చక్రవర్తి, సతీష్, లక్ష్మణ్, హరిబాబు, ప్రణయ్ పాల్గొన్నారు.


