
వన్యప్రాణులకు నీటి వసతి
అభయారణ్యంలో మూగజీవాల
దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చర్యలు
● ప్రత్యేక సాసర్ పీట్స్, నీటి కులాయిల నిర్మాణం
● దట్టమైన అడవిలో 100సోలార్ బోర్లు
ఏటూరునాగారం: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో అడవిలోని వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటాయి. వాటి దాహాన్ని తీర్చి సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు అభయారణ్యంలో నీటి వసతికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అభయారణ్యంలో నెమళ్లు, కోతులు, కొండెంగలు, అడవి దున్నలు, దుప్పులు, జింకలు, గుడ్డేలుగులు వంటి జంతువులు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. వాటి ఆవాసాలను ప్రత్యేకంగా గుర్తించిన అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.