వెంకటాపురం(కె): జీసీసీ రేషన్ షాపుల డీలర్లు, అధికారులు అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలని జీసీసీ ఏటూరునాగారం డీఎం ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం ఆవరణలో జీసీసీ 10వ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆర్థిక లావాదేవీలపై నివేదికను వినిపించారు. భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై ప్రణాళికలను రూపొందించున్నారు. జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజిల్ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎం దృష్టికి సభ్యులు తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అటవి ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలన్నారు. అదే విధంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ స్వామి, నర్సింహారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.
జీసీసీ డీఎ ప్రతాప్‌రెడ్డి


