ఏటూరునాగారం: తునికాకు కూలీల బోనస్‌లో అవినీతి జరిగిందని అర్హులైన కూలీలు 2023 ఆగస్టులో సీసీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే అటవీశాఖలో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్, మిగతా ఆరుగురు వాచర్స్ ఖాతాల్లో కూలీలకు చెందిన తునికాకు బోనస్ డబ్బులు పడినట్లు ప్రత్యేక టీం గుర్తించింది. వారి రిపోర్ట్ మేరకు ఇటీవల అటవీశాఖ రేంజ్ అధికారి అఫ్సరున్నీసా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు విచారణను ముమ్మరం చేశారు. దీంతో కిషన్, వాచర్స్ వైకుంఠం, కన్నాయిగూడెంకు చెందిన మధుకర్, మహబూబ్, భిక్షపతి, నర్సింహులు, ప్రసాద్ అనే ఏడుగురి ఖాతాల్లో నగదు జమ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బాధితులు సాక్షిని సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో సాక్షిలో ‘అటవీశాఖ రేంజ్ అధికారి మోసం’ అనే శీర్షికన ఈనెల 19న కథనం ప్రచురితమైంది. బాధితులకు జరిగిన నష్టాన్ని వివరించగా పోలీసులు కథనాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మరుసటిరోజు బాధితులు.. బాలరాజు వద్దకు వెళ్లి డబ్బులు మీరే వేయించి మీరే డ్రా చేయించారని చెప్పగా నాకు ఎలాంటి సంబంధం లేదు.. అంటూ బుకాయించాడు. ఆధారాలున్నా యా.. అంటూ దిక్కరించారు. దీంతో 20వ తేదీన ‘తునికాకు బోనస్‌లో చేతి వాటం’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో టాస్క్ ఫోర్స్, ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేయగా రేంజ్ అధికారి బాలరాజు హస్తం ఉందని తేలింది. దీంతో బాధితుల నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించి శనివారం బాలరాజుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. అసలు నిందితుడు దొరకడంతో ఈ ఏడుగురిపై కేసును తొలగించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఘటనలో ఇంకెవరి ప్రమేయమైన ఉందా.. అనేది తెలియాల్సి ఉంది.
పేదలకు అండగా నిలిచిన సాక్షి
మండల కేంద్రానికి చెందిన పలువురు అటవీశాఖలో పనిచేస్తున్నారు. వారిపై అక్రమ కేసు నమోదు చేయించి తప్పించుకోవాలని చూసిన అధికారి విషయాన్ని బట్టబయలు చేసిన సాక్షికి కృతజ్ఞతలు. పేదలను ఈ కేసు నుంచి తప్పించి ఆదుకోవాలి.
– ఇర్సవడ్ల సంతోష్, గ్రామస్తుడు,
ఏటూరునాగారం
తునికాకు కూలీల బోనస్ డబ్బుల స్వాహా
రూ.2.70 లక్షల దుర్వినియోగం
కేసు నుంచి బయటపడ్డ ఏడుగురు..
‘సాక్షి’కి అభినందనలు
రేంజ్ అధికారి బాలరాజు అరెస్ట్
రేంజ్ అధికారి బాలరాజు అరెస్ట్
రేంజ్ అధికారి బాలరాజు అరెస్ట్