మలుగు: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ములుగు జిల్లా కోర్టు సివిల్ జడ్జి కన్నయ్య లాల్ వినుత్న శిక్ష వేశారు. సుమారు నాలుగు గంటల పాటు సమాజ సేవ చేయాలని, జరిమానా కట్టాలని ఆదేశించారు. దీంతో ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కమ్యునిటీ సర్వీస్‌లో పోగ్రాంలో భాగంగా ఏరియా ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న ప్లాిస్టిక్ కవర్లు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించారు.
కుష్ఠు నిర్ధారణ సర్వే
వాజేడు: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. ములుగు జిల్లా వైద్యాధికారి గోపాలరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్ర కాంత్ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఈసర్వేలో పాల్గొన్నారు. మార్చి 30 వరకు ఈ సర్వే ఇలాగే జరుగుతుందని అనుమానితుల పేర్లను నమోదు చేసుకుని వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు వైద్యాధికారి మధుకర్ వెల్లడించారు. సర్వేలో కోటిరెడ్డి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కనీస వేతనం ప్రకటించాలి..
ములుగు రూరల్: పార్లమెంట్ బడ్జెట్‌లో ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌ఓ కార్యలయం ఎదుట ఆశ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపి అనంతరం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆశల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలాదేవి, రజిత, సుధా, అనిత, ఛాయాదేవి, రమాదేవి, సంధ్య, కవిత, మంజుల, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన విదేశీయుడు
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని యూరప్‌లోని మాల్దోవాకు చెందిన ఓలెగ్ బివోల్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా.. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి రాష్ట్ర టూరిజం గైడ్ సాయినాథ్ వివరించగా రామప్ప శిల్పాకళా సంపద బాగుందని కొనియాడారు. రామప్ప అందాలను తన ఫోన్‌లో బంధించుకున్నారు.
మద్యం సేవించి వాహనం నడిపినందుకు సమాజ సేవ
మద్యం సేవించి వాహనం నడిపినందుకు సమాజ సేవ
మద్యం సేవించి వాహనం నడిపినందుకు సమాజ సేవ


