షారుఖ్ ఖాన్‌ కుమార్తెపై యంగ్‌ హీరో ఇంట్రెస్టెంగ్‌ కామెంట్స్‌ | Young Hero Vedang Raina Interesting Comments On Suhana Khan | Sakshi
Sakshi News home page

షారుఖ్ ఖాన్‌ కుమార్తెపై యంగ్‌ హీరో ఇంట్రెస్టెంగ్‌ కామెంట్స్‌

Oct 9 2024 2:55 PM | Updated on Oct 9 2024 3:46 PM

Young Hero Vedang Raina Interesting Comments On Suhana Khan

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ ముద్దుల తనయ, నటి సుహానా ఖాన్‌పై యంగ్‌ హీరో వేదాంగ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మేకప్‌ వేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని, షూటింగ్‌ సమయంలో ఆమె టీమ్‌ అంతరాయం కలిగించేదని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా బట్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వేదాంగ్‌ రైనా మీడియాతో ముచ్చటించారు. 

(చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో?)

ఈ సందర్భంగా తొలి సినిమా కోస్టార్‌ సుహానా ఖాన్‌పై ఎప్పుడైనా కోపం వచ్చిందా అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై వేదాంగ్‌ స్పందిస్తూ.. ‘సుహానా చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిసోతుంది. కోపం వచ్చేలా ఆమె ప్రవర్తించదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం చిరాకుగా అనిపించేంది. ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. షూటింగ్‌ సమయంలో మేమంతా రెడీ అయి ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. దాదాపు గంట లేట్‌గా సెట్‌పైకి వచ్చేది. 

(చదవండి: పెళ్లి గురించి అమితాబ్‌ ప్రశ్న.. జునైద్ ఖాన్ ఆన్సర్‌కు తండ్రి షాక్)

షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత ‘జుట్టు బాలేదు..మేకప్‌ సరిగా లేదు’అంటూ ఆమె టీమ్‌ మధ్యలో అంతరాయం కలిగించేంది. దాని వల్ల మా బృందం అంతా ఇబ్బంది పడింది. ఇందులో సుహానాది తప్పులేదు. ఆమె పాత్ర అలా డిజైన్‌ చేశారు. అందుకే మేకప్‌కి ఎక్కువ సమయం తీసుకునేది’అని వేదాంగ్‌ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement