Actress Yami Gautam Instagram Account Hacked, Warns Fans About Any Unsual Activity - Sakshi
Sakshi News home page

Yami Gautham: నా సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌ అయ్యింది, అప్రమత్తంగా ఉండండి

Apr 4 2022 9:25 AM | Updated on Apr 4 2022 11:39 AM

Yami Gautam Instagram Account Hacked, She Wants Her Followers - Sakshi

సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేరుగా నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయయే అయినప్పటికీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తత లేకపోతే ఎలాంటి నష్టమైన జరగొచ్చు. గతంలో ఎంతోమంది స్టార్‌ హీరోయిన్ల అకౌంట్లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్‌ చేసి డబ్బు వసూలు చేయడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం చేస్తుంటారు.

చదవండి: అందుకే ‘ఆదిపురుష్‌’గా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌: ఓం రౌత్‌

అందుకే ముందు జాగ్రత్తగా తమ ఫాలోవర్స్‌ను వారు అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ యామీ గౌతమ్‌ కూడా తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను అలర్ట్‌ చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు వెల్లడించింది. దీనిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, తన ఖాతా నుంచి వచ్చిన ఎలాంటి పోస్ట్‌, ప్రకటనలకు స్పందించవద్దని పేర్కొంది. ప్రస్తుతం ఆమె టీం దీనిపై వర్క్‌ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగ ఇటీవల పెళ్లి చేసుకున్న యామీ ప్రస్తుతం దస్వీ మూవీతో బిజీగా ఉంది. అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీనితో పాటు ఆమె ‘ఓ మై గాడ్‌ సిక్వెల్‌’లో కూడా నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement