Adipurush Movie Director Om Raut Interesting Comments On Prabhas And His Role - Sakshi
Sakshi News home page

Prabhas Adipurush: అందుకే ‘ఆదిపురుష్‌’గా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌: ఓం రౌత్‌

Apr 4 2022 8:06 AM | Updated on Apr 4 2022 9:23 AM

Adipurush Movie Director Om Raut Interesting Comments On Prabhas - Sakshi

Director Om Raut Interesting Comments On Prabhas:‘ఆదిపురుష్‌’ సినిమా కోసం ప్రభాస్‌ ఎంతగానో కష్టపడ్డారని చిత్రదర్శకుడు ఓం రౌత్‌ చెబుతున్నారు. మైథలాజికల్‌ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారు. ఈ పాత్ర కోసం ప్రభాస్‌ మారిన తీరు గురించి ఓం రౌత్‌ చెబుతూ.. ‘‘ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫేస్‌ చేసిన సవాళ్ల లిస్ట్‌ కాస్త పెద్దదిగానే ఉంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారు. ఇందుకోసం ప్రభాస్‌ విలువిద్యలో శిక్షణ తీసుకున్నారు. మామూలుగా విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ ఆకారంలో ఉంటుంది.

చదవండి: టాలీవుడ్‌ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్‌ క్రికెటర్‌!

భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉండటాన్నే ‘వి’ షేప్‌ అంటారు. ప్రభాస్‌ ఆ ఆకృతికి మారారు. అలాగే తెలుగు వెర్షన్‌ కోసం సంస్కృత డైలాగ్స్, హిందీ వెర్షన్‌ కోసం హిందీ డైలాగ్స్‌ని స్పష్టంగా పలకడానికి ప్రభాస్‌ మెరుగైన సాధన చేశారు. అందుకే ‘ఆదిపురుష్‌’గా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ అని చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. ఇక సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ కనిపిస్తారు. జనవరిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement