శంకర్‌-రామ్‌చరణ్‌ సినిమా మరింత ఆలస్యం కానుందా?

Will Ramcharan Completes A New Film Before Shankar? - Sakshi

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందు తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రంలో హీరోగా నటిస్తున్నారు రామ్‌చరణ్‌ (ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో హీరో). ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ను జూలై చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా అనుకున్న సమయానికి చిత్రీకరణ ఆరంభం అయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందట.

మరోవైపు ఈ చిత్రదర్శకుడు శంకర్‌ ‘ఇండియన్‌ 2’, ‘అన్నియన్‌’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌కు సంబంధించిన వివాదాలతో సతమతమవుతున్నారు. ఈ వివాదాలు ఓ కొలిక్కి వచ్చి, చరణ్‌తో చేయనున్న సినిమా ఆరంభం కావడానికి టైమ్‌ పట్టేట్లుందట. అందుకే ఈ గ్యాప్‌లో ఓ కొత్త సినిమా కమిట్‌ అవ్వాలని రామ్‌చరణ్‌ భావిస్తున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల రామ్‌చరణ్‌ కథలు వింటున్నారని వినికిడి. మరి.. శంకర్‌తో సినిమా చేయడానికంటే ముందే రామ్‌చరణ్‌ ఓ కొత్త సినిమాను కంప్లీట్‌ చేస్తారా? లేక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తవగానే శంకర్‌ సినిమాతో బిజీ అవుతారా? వేచి చూడాల్సిందే.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top