చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య | Actor Bala Ex Wife Dr Elizabeth Udayan Shares Emotional Video With Serious Allegations, Says Will I Get Justice | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసినా నో యూజ్‌, నేను చనిపోతే అతడే బాధ్యుడు.. నటుడి మాజీ భార్య

Jul 16 2025 2:01 PM | Updated on Jul 16 2025 3:27 PM

Will i Get Justice? Bala Ex Wife Elizabeth Shares Video

నటుడు బాలా (Actor Bala) పర్సనల్‌ విషయాలతో ఎప్పుడూ వివాదాల్లో నానుతూనే ఉంటాడు. చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. తర్వాత నటి అమృతా సురేశ్‌ను వివాహం చేసుకోగా కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. అయితే డివోర్స్‌ తర్వాత తనతోపాటు, తన కూతుర్ని కూడా వేధించారని అమృత పోలీసులను ఆశ్రయించడం, వారు బాలను అరెస్ట్‌ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలోనే డాక్టర్‌ ఎలిజబెత్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. 

నాకేదైనా జరిగితే తనదే బాధ్యత
ఆమెను కూడా వదిలేసి గతేడాది కోకిలను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇలా నాలుగు పెళ్లిళ్లతో బాలా సోషల్‌ మీడియాలో తెగ సెన్సేషన్‌ అయ్యాడు.  తాజాగా డాక్టర్‌ ఎలిజబెత్‌ (Elizabeth Udayan) షేర్‌ చేసిన వీడియోతో మరోసారి బాలా పేరు తెరపైకి వచ్చింది. అందులో ఆమె ఆస్పత్రి బెడ్‌పై ఉంది. ఎలిజబెత్‌ ఏమందంటే.. నాకేదైనా జరిగితే నా మాజీ భర్త, అతడి కుటుంబానిదే పూర్తి బాధ్యత. అతడి గురించి ఏళ్లతరబడి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. 

చనిపోయేలోపు న్యాయం?
సోషల్‌ మీడియాలో గోడు వెల్లబోసుకున్నా, సీఎంను కలిసినా, కోర్టు మెట్లెక్కినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పైగా నన్నే బెదిరిస్తున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. అదే చాలా బాధగా ఉంది. నాకేదైనా జరిగితే అతడి(బాలా)తోపాటు అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొంది. ఈ వీడియోకు 'నేను చనిపోయేలోపు నాకు న్యాయం జరుగుతుందా?' అని క్యాప్షన్‌ జోడించింది.

నీ ఉసురు ఊరికే పోదు
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడదాని కన్నీళ్ల ఉసురు ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. వీలైతే జరిగినదాన్ని మర్చిపో, కౌన్సెలింగ్‌ తీసుకో.. అతడి చెర నుంచి తప్పించుకోవడమే ఒక వరంలా భావించు, నువ్వు అతడిని చాలా ప్రేమించావు. కానీ, ఈరోజు కాకపోయినా రేపయినా అతడికి తగిన శాస్తి జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

డాక్టర్‌వి అయ్యుండి ఇలా..
మరికొందరేమో.. నువ్వు ఒక డాక్టర్‌వి.. గతాన్ని మర్చిపోయి నీ వృత్తికి పూర్తి స్థాయి సమయం కేటాయించు, వైద్యురాలివయ్యుండి చనిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించు. అది వీలుకాకపోతే మీ జీవితంలోనే పెద్ద సమస్య అయిన వ్యక్తి మీకు దూరంగా వెళ్లిపోయాడని మీకు మీరు భరోసా ఇచ్చుకోండి అని కామెంట్లు చేస్తున్నారు.

 

చదవండి: నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్‌, అందుకే రెట్టింపు తీసుకుంటున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement