వినాయక్‌ చేతుల మీదుగా చెక్‌మేట్‌ ట్రైలర్‌ | VV Vinayak Released Rajendra Prasad Checkmate Trailer | Sakshi
Sakshi News home page

వినాయక్‌ చేతుల మీదుగా చెక్‌మేట్‌ ట్రైలర్‌

Jul 29 2020 6:31 PM | Updated on Jul 29 2020 6:32 PM

VV Vinayak Released Rajendra Prasad Checkmate Trailer - Sakshi

నట కిరీటి రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన చెట్‌మేట్‌ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై  ప్రసాద్  వెలంపల్లి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, సందీప్, విష్ణుప్రియ, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌ ఆవిష్కరించిన సందర్భంగా వీవీ వినాయక్‌ మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్ చాలా బాగుంది .నేటి యువత అభిరుచులకు అద్దం పడుతూ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలతో సినిమా వుంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం,రఘుబాబు,కృష్ణ భగవాన్ వంటి సీనియర్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు ప్రసాద్ నాకు మంచి మిత్రుడు.అతను చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అని తెలిపారు. 

దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో యూత్ ముఖ్యంగా అమ్మాయిలు.. వాళ్లకు ఏదైనా సమస్య వస్తే డైర్యంగా ఆసమస్య ను పరిష్కరించుకోలేక, ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేక అత్మ హత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను దైర్యం గా పరిష్కరించుకోవాలి అనే పాయింట్‌తో నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా దైర్యం గా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాము. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. సినిమా అందరికీ నచ్చే విధంగా భారీ స్టార్ కాస్ట్‌తో, మలేషియా సింగపూర్‌లలోని బ్యూటిఫుల్ లోకేషన్స్‌లో తెరకెక్కించాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ట్రైలర్ రిలీజ్ చేసి మా చిత్రాన్ని తన సినిమాగా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement