300 మిలియన్ల వ్యూస్‌ కొల్లగొట్టిన చిన్న సినిమా | Vitamin She Telugu Movie Reach 300 Million Views | Sakshi
Sakshi News home page

Vitamin She: విటమిన్‌ షి మూవీకి 300 మిలియన్‌ వ్యూస్‌

Dec 5 2021 7:40 PM | Updated on Dec 5 2021 7:49 PM

Vitamin She Telugu Movie Reach 300 Million Views - Sakshi

Vitamin She Received 300 Million Views In MX Player: విటమిన్‌ షి.. వినూత్న టైటిల్‌తో ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పేపర్‌ బాయ్‌ ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ఎంఎక్స్‌ ప్లేయర్‌లో విడుదలైంది. ఈ సినిమా ఎవరి అంచనాలకు అందని విధంగా 300 మిలియన్ల వ్యూస్‌ రాబట్టడం విశేషం.

మనిషి అవసరాల కోసం ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్‌ మనిషినే డామినేట్‌ చేసే స్థితికి వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ అనేది ఒక మెషిన్‌ లాంటిదే. మెషిన్స్‌ నూనె మాత్రమే తయారు చేస్తాయి. కానీ దీపం వెలిగించాలంటే చేతులే కావాలి కదా.. ఇలాంటి వైవిధ్యమైన కథాంశంతో వచ్చింది విటమిన్‌ షి అనే వెబ్‌ ఫిల్మ్‌.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల జీవితాల్ని ఎలా ఆక్రమిస్తుందనేది కథ. శ్రీకాంత్ గుర్రం, ప్రాచీ టక్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ‘విటమిన్ షి’అనే అల్ట్రా మోడరన్ వాయిస్ అసిస్టెంట్‌ ఫోన్‌ది కీలక పాత్ర. ఎంఎక్స్‌ ప్లేయర్‌లో అందుబాటులో ఉన్న సినిమాను ఇప్పటివరకు చూడనట్లైతే ఓ లుక్కేసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement