‘మెకానిక్ రాకీ ’లో బర్నింగ్‌ పాయింట్‌ని టచ్‌ చేశాం: విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Talk About Mechanic Rocky Movie | Sakshi
Sakshi News home page

‘మెకానిక్ రాకీ ’లో బర్నింగ్‌ పాయింట్‌ని టచ్‌ చేశాం: విశ్వక్‌ సేన్‌

Nov 19 2024 4:55 PM | Updated on Nov 19 2024 7:13 PM

Vishwak Sen Talk About Mechanic Rocky Movie

‘మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇందులో గత నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న ఓ బర్నింగ్‌ పాయింట్‌ని టచ్‌ చేశాం. అది స్క్రీన్‌ మీద చూసినప్పుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్‌ని ఎందుకు టచ్‌ చేయలేదని ఆడియన్స్‌ ఫీల్‌ అవుతారు’అని అన్నారు యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’.  రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 22న ప్రేక్షకుల  ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విశ్వక్‌ సేన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మెకానిక్‌ రాకీ రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్ తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ ఎలిమెంట్ కి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్ ని తీసుకోవచ్చు.

ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి  జోనర్ మారుతుంది. సెకండ్ హఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ ఉంది. మేము ట్రైలర్ లో కథని పెద్దగా రివిల్ చేయలేదు. సినిమాలో చాలా కథ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్, రైటింగ్ ని మెచ్చుకుంటారు. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

సినిమా లో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్ గారు, రఘు, సునీల్,  అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్ తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్ ప్లే రేటింగ్ కి చాలా మంచి పేరు వస్తుంది.  

కొత్త సినిమాల విషయాలకొస్తే..లైలా 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు ప్యార్లల్ గా జరుగుతాయి. కల్ట్ మార్చ్ లో మొదలుపెడతాం. ఏమైయింది నగరానికి 2 రైటింగ్ జరుగుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement