విష్వక్‌ సేన్‌ 'లైలా' సాంగ్‌ రిలీజ్‌.. ప్రత్యేకత ఎంటో తెలుసా..? | Vishwak Sen Laila Movie Song Out Now | Sakshi
Sakshi News home page

విష్వక్‌ సేన్‌ 'లైలా' సాంగ్‌ రిలీజ్‌.. ప్రత్యేకత ఎంటో తెలుసా..?

Dec 29 2024 1:04 PM | Updated on Dec 29 2024 3:31 PM

Vishwak Sen Laila Movie Song Out Now

మాస్ కా దాస్ 'విష్వక్‌ సేన్‌' వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా 'లైలా' నుంచి అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.  రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా మూవీకి దర్శకత్వం వహించే భాద్యత కొత్తవారికి ఇవ్వడంతో విష్వక్‌పై ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిపై హీరో పెట్టకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ..  ఈ చిత్రం నుంచి  విడుదలైన ఫ‌స్ట్ లుక్‌ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.  

ఇప్పుడు 'సోను మోడల్‌' అంటూ సాగే ఈ పాటకు  విష్వక్‌ లిరిక్స్‌ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. అందుకు తగినట్లు నారాయణన్‌ రవిశంకర్‌, రేష్మా శ్యామ్‌ ఆలపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి లైలా రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement