ఓటీటీకి 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Vishnu Vishal Matti Kusthi locks OTT release date On Netflix | Sakshi
Sakshi News home page

Matti Kusthi: ఓటీటీకి 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Dec 27 2022 7:00 PM | Updated on Dec 27 2022 7:01 PM

Vishnu Vishal Matti Kusthi locks OTT release date On Netflix - Sakshi

నటుడు విష్ణు విశాల్‌, ఐశ్యర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మట్టి కుస్తీ. విష్ణు విశాల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై టాలీవుడ్‌ నటుడు రవితేజతో కలిసి  ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 

(ఇది చదవండి: Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ)

కథేంటంటే.. 
కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్‌ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్‌ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్‌ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్‌) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్‌) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్‌ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్‌ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్ల‌ర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్‌ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement