విశాల్‌, ఆర్యల భారీ మల్టిస్టారర్‌ ‘ఎనిమీ’ షూటింగ్‌ పూర్తి, త్వరలోనే టీజర్‌!

Vishal And Arya Multistarrer Enemy Movie Shooting Wrap Up - Sakshi

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత మరోసారి వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించాడు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాగా తాజాగా  ‘ఎనిమీ’ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు  హీరో విశాల్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఈ సంద‌ర్భంగా...‘ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్‌ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్‌ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్, కెమెరామ్యాన్‌ ఆర్‌డి రాజశేఖర్, నిర్మాత వినోద్‌ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్‌ సభ్యులందరికి ధన్యవాదలు’ అంటూ విశాల్‌ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. వీలైనంత త్వరగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top