ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్‌.. అదిరిపోయింది!

Viral video: Malaika Arora And Nora Fatehi Dance on Munni Badnaam Song - Sakshi

ఒక్క నటి డాన్స్‌ చేస్తేనే కళ్లు తిప్పకోకుండా చూస్తాం. అలాంటిది ఇద్దరు అందమైన ముద్దు గుమ్మలు స్టేజ్‌పై స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది. చూడటానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది. అచ్చం ఇలాగే నటి మలైకా అరోరా, డాన్సర్‌ నోరా ఫతేహితో కలిసి ఓ డాన్స్‌ షో వేదికపై చిందులు వేశారు. ఇద్దరూ కలిసి సల్మాన్‌ ‘దబాంగ్‌’ సినిమాలోని మలైకా నటించిన ఐటమ్‌ సాంగ్‌ ‘మున్నీ బద్నామ్ హుయ్’ అనే పాటకు ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోను మలైకా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘కేవలం కంటెస్టెంట్స్‌ మాత్రమే ఫన్‌ అందిస్తారా.. కాస్తా ఛేంజ్‌ కోసం ఈ రోజు సోనీ ఛానల్‌లో ప్రసారమయ్యే ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్స్ ‌షో చూడడం మర్చిపోకండి.’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (మాస్క్ ఎలా ధ‌రించాలో చెప్పిన న‌టి)

ఇక వీడియోలో వీరి ఇద్దరు చేసిన డాన్స్‌ను చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. కాగా ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్స్ షో న్యాయ నిర్ణేతలలో మలైకా ఒకరు. ఇక షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దిల్ సే సినిమాలోని చయ్య చయ్య పాటతో ఊపేసిన మలైకా అరోరా మున్నీ బద్నామ్‌ హుయ్‌ పాటతో మరోసారి పాపులర్‌ అయ్యారు. తన సినిమాలు, డ్యాన్సులతోనే కాదు.. తన వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఎన్నో వివాదాలతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. (విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top