మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి

Viral: Niharika Konidela Pre Wedding Festivities Begin At Her Home - Sakshi

కొణిదెల వారింట పెళ్లి సందడి మొదలైంది. మరో నాలుగు రోజుల్లో మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆగష్టులో నిశ్చితార్థం చేసుకున్న నిహారిక-చైతన్యల జంట డిసెంబర్‌ 9 మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా జరగనుంది. మెగా కుటుంబంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా ప్రీ-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జోరందుకున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చదవండి: మీకన్నా నాకెవరున్నారు: నిహారిక

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా నేడు (శనివారం) నిహారికను పెళ్లి కూతురుగా చేశారు. తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఇక అందంగా ముస్తాబు అయిన నిహారిక ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. ​కాగా నిహారిక పెళ్లి కార్యక్రమాల్లో చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలా ఉండగా నాగబాబు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ఎం. ప్రభాకర్‌ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన జరగనుంది. రాజస్తాన్‌లో జరిగే ఈ డెస్టినేషన్‌  వెడ్డింగ్‌ కోసం ఇరు కుటుంబాలు రాజస్తాన్‌ తరలి వెళ్లనున్నాయి. చదవండి: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. మరో నాలుగు రోజుల్లోనే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top