RC 15 Movie: రామ్‌చరణ్‌తో స్టెప్పులేయించనున్న జానీ మాస్టర్‌

Viral: Choreographer Jani Master In Ram Charan And Shankar Movie - Sakshi

Jani Master: అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వాటిని అందుకుంటూ పోవాలి. వచ్చిన ఏ చిన్న అవకాశమైనా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయానికి బాటలు వేసుకోవాల్సిందే. దీనివల్ల సక్సెస్‌ రావడానికి, ఫేమ్‌ తెచ్చుకోవడానికి కాస్త టైం పడుతుందేమో కానీ ఫలితం మాత్రం దక్కకుండా పోదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇదే సూత్రాన్ని నమ్మి పైకొచ్చారు చాలామంది. అందులో ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్‌ ఒకరు.

స్టేజ్‌ పర్ఫామర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి గ్రూప్‌ డ్యాన్సర్లలో ఒకరిగా పని చేసి చివరకు డ్యాన్స్‌ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కొరియోగ్రఫీ అందిస్తున్న అతడు ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే హీరోగా మారినా తన ప్యాషన్‌ను పక్కన పడేయలేదు. తాజాగా అతడు రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబోలో వస్తున్న మెగా మూవీకి కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు.

"శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ప్రేమికుడు చిత్రంలోని ముకాబులా పాటకు స్టేజ్‌ పర్ఫామర్‌గా మొదలైంది నా ప్రయాణం. తర్వాత బాయ్స్‌ సినిమాలో 500 మంది బ్యాకప్‌ డ్యాన్సర్లలో ఒకరిగా పని చేశాను. ఇప్పుడు ఏకంగా శంకర్‌ సినిమాలో అది కూడా నా ఫేవరెట్‌ హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రంలో కొరియోగ్రాఫర్‌గా పని చేసే అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు రామ్‌చరణ్‌కు, నిర్మాత దిల్‌ రాజుకు సర్వదా కృతజ్ఞుడిని" అని జానీ మాస్టర్‌ ట్వీట్‌ చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top