
కొరియాగ్రాఫర్ ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ సందీప్ గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్బాస్ కంటెస్టెంట్గా తన భర్త పాల్గొన్నప్పుడు ఫుల్ సపోర్ట్గా నిలిచింది. అయితే కొన్నిసార్లు అభిమానులతో వివాదాలు కూడా కొని తెచ్చుకుంది. ప్రస్తుతం డ్యాన్స్ అకాడమీలో బిజీగా ఉన్న జ్యోతిరాజ్ సందీప్ ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం జనరేషన్లో భార్య, భర్తల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది. మా ఇద్దరిని చూసినప్పుడు అబ్బా.. ఎంత అద్భుతమైన జంట అని అందరూ అనుకుంటారు.. కానీ దాని వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని మాట్లాడింది.
నేటి సమాజంలో పెళ్లి, ప్రేమ, విడాకులు, భార్య-భర్తల రిలేషన్స్ గురించి వీడియోలో ప్రస్తావించింది. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తగ్గి ఉంటేనే బంధాలు బలంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్‌లో కొత్త జంటలు విడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు కూడా తగ్గకపోవడమేనని అని వివరించింది. ఇక్కడ తగ్గడం అంటే మన ఇష్టాలను త్యాగం చేయడమే.. కానీ ఆ త్యాగంలో కూడా ప్రేమను వెతుక్కోవచ్చని సలహా ఇచ్చింది. అయితే జ్యోతిరాజ్ మాటలను కొందరు సమర్థించగా.. మరికొందరేమో వ్యతిరేకించారు. దీంతో మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ మరో వీడియో పోస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.
జ్యోతిరాజ్ తన వీడియోలో మాట్లాడుతూ..'మొన్న నేను చేసిన వీడియోకు బాగా రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది కాల్ కూడా చేశారు. అయితే కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయని ఘాటుగా స్పందిస్తున్నారు. దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. చాలామంది మొగుళ్లను వదిలేస్తున్నారు. అలా అని చెప్పి మగవాళ్లందరు సుద్దపూసలని నేను చెప్పట్లేదు. ఇప్పటికీ ఆడవాళ్లలో బంగారు తల్లులు, బంగారు పెళ్లాలు ఉన్నారు. ఫ్యామిలీ, పిల్లల కోసం చదివిన చదువులను కూడా త్యాగం చేసినవాళ్లు ఉన్నారు. నేను అలాంటి వారి గురించి మాట్లాడట్లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులు కష్టపడి పెంచితే.. చిన్నచిన్న కారణాలతో విడిపోయి ఇంట్లో ఉంటే వాళ్లు బాధపడతారు. ఎంతోమందిని చూసిన తర్వాత నేను ఆ వీడియో చేశా. దానికి మీరు ఏదేదో ఊహించుకుని నా మనసులో ఏదో బాధ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఈ ప్రపంచంలోనే మోస్ట్ లక్కీయస్ట్ వైఫ్ని. మా ఆయనకు నేనంటే పిచ్చి.. మా ఆయనంటే నాకు పిచ్చి.. మేమలా ఫిక్సయ్యాం. తగ్గాలంటే చేతులు కట్టుకుని నిలబడాలని కాదు.. ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండాలి. అదే నా ఇంటెన్షన్' అని తన వ్యాఖ్యలపై ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది. ఈ కాలంలో భార్య, భర్తల రిలేషన్స్ గురించి గొప్పగా చెప్పారంటూ జ్యోతిరాజ్పై కొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.