Jani Master: హీరోగా మారిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా, శ్రష్టి వర్మ నాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభ మైంది. ముహూర్తపు సన్నివేశానికి సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బాగుంటుందని ‘యథా రాజా తథా ప్రజా’లో నటిస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు జానీ. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: సునోజ్ వేలాయుధన్.
Thank you for gracing the Pooja Ceremony of my new film #YathaRajaTathaPraja 🙏🏼@ImSharwanand garu, #AayushSharma ji & #JKarunaKumar garu 😇@imVdeshK @verma_shrasti #SrinivasVittala #HareshPatel #OmMovieCreations #SriKrishnaMovieCreations @PulagamOfficial pic.twitter.com/ggVBogGXSL
— Jani Master (@AlwaysJani) August 22, 2022