వైరల్‌: ఉద్యోగికి బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చిన బన్నీ | Viral: Allu Arjun Hosts Bachelor Party For Employee | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఉద్యోగికి బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చిన బన్నీ

Nov 6 2020 2:36 PM | Updated on Nov 6 2020 2:42 PM

Viral: Allu Arjun Hosts Bachelor Party For Employee - Sakshi

జీవితంలో ఒక్క‌సారైనా తాము ఇష్టపడే సినీ తారలతో క‌లిసి ఓ ఫొటో దిగాల‌ని అభిమానులు ఆశపడుతుంటారు. వారిని నేరుగా చూడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. కానీ వారందరికీ ఆ అవకాశం రాకపోవచ్చు. కానీ అల్లు అర్జున్‌ వద్ద పనిచేసే ఓ వ్యక్తి బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. అదేంటంటే.. ఇటీవల బన్నీ వద్ద పనిచేసే అభినవ్‌ నథ అనే వ్యక్తికి పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. ఈ క్రమంలో బన్నీ అతనికి బ్యాచిలర్‌ పార్టీ ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అనంతరం తన ఉద్యోగులందరితో కలిసి ఫోటో కూడా దిగాడు. దీంతో ఆ ఉద్యోగి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా తన స్టాఫ్‌ను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ట్రీట్‌ చేస్తానని, తన పెళ్లికి కూడా వెళతానని బన్నీ తెలిపాడు. చదవండి: ‘కలర్‌ ఫోటో’పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్

ఈ విషయం తెలుసుకున్నబన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కింద పని చేసే వారిని కూడా అల్లు అర్జున్‌ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారని, అందరితోనూ కలివిడిగా ఉంటారని పొగిడేస్తున్నారు. అదే విధంగా ఇటవల కలర్‌ ఫోటో చిత్రంపై అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. సినిమా అద్భుతంగా ఉందంటూ దర్శకుడు సందీప్‌ను, చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తన్నాడు. ఎర్ర చెందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన ​హీరోయిన్‌గా నటిస్తున్నారు. కొంత వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌లో తిరిగి ప్రారంభం కానుంది. చదవండి: పుష్ప షూటింగ్‌; వైజాగ్‌కు బన్నీ, రష్మిక

Advertisement
 
Advertisement
Advertisement