తెలంగాణ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్.. ఆ ఓటీటీలోనే రిలీజ్? | Vikatakavi Web Series OTT Release Date Details | Sakshi
Sakshi News home page

తెలుగులో డిటెక్టివ్ వెబ్ సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే?

Apr 8 2024 7:18 PM | Updated on Apr 8 2024 7:34 PM

Vikatakavi Web Series OTT Release Date Details - Sakshi

ఓటీటీల వల్ల చాలామంది సినిమాలు, వెబ్ సిరీసులకు బాగా అలవాటుపడిపోయారు. కొత్త రిలీజులు ఏమున్నాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు స్ట్రెయిట్ వెబ్ సిరీస్ ఒకటి రెడీ అయిపోయింది. తెలంగాణ నేపథ్యంగా ఈ సిరీస్ తీయడం విశేషం.

(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా)

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఆచితూచి సినిమాలు, సిరీసులు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ 'దూత' లాంటి స్ట్రెయిట్ వెబ్ సిరీస్ వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు అలానే 'వికటకవి' అనే డిటెక్టివ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. డేట్ చెప్పాల్సి ఉంది. అయితే ఏప్రిల్ చివర్లో లేదా మే తొలివారంలో స్ట్రీమింగ్  కావొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement