
‘కేజీఎఫ్’ఫేం ప్రశాంత్ నీల్ కిశోర్ దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ మినహా మిగతా నటీనటుల ఎంపికను ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ‘సలార్’లో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రాహంను సంప్రదించినట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ తాజాగా మరో స్టార్ హీరోను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఉంటే చాలు తెలుగుతో పాటు తమిళంలోనూ భలే మార్కెట్ ఉంటుంది. ఇదే క్రేజ్‌తో ఇటీవల ఆయన బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టారు. (చదవండి: ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని సమాధానం)
అక్కడ ఆయన నటించిన సినిమాలు విడుదల సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీ-టౌన్ ప్రేక్షకులను విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’లో విలన్‌గా విజయ్ సేతుపతి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (చదవండి: పవర్‌ఫుల్ రోల్)
కాగా ప్రభాస్.. తాజాగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సలార్ షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి వెంటనే ఆదిపురుష్ షూటింగ్‌లో పాల్గోననున్నాడు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.