పవర్‌ఫుల్‌ రోల్‌

Vijay Sethupathi for releasing the poster of Uppena - Sakshi

నాయకుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు... ఇలా ఏ పాత్రలో అయినా నటించి, మెప్పించగల నటుడు విజయ్‌ సేతుపతి. త్వరలో విడుదల కానున్న ‘ఉప్పెన’లో ఆయన కీలక పాత్ర చేశారు. శనివారం (జనవరి 16) విజయ్‌ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. పంజా వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా సుకుమార్‌ రైటింగ్స్‌ భాగస్వామ్యంతో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ  చిత్రాన్ని నిర్మించారు. ‘‘ఇందులో విజయ్‌ సేతుపతిది చాలా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌. అద్భుతంగా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సముద్రతీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, మ్యూజిక్‌: దేవి శ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: షామ్‌దత్‌ సైనుద్దీన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అనిల్‌ వై, అశోక్‌ బి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top