ఖుదీరామ్‌ కష్టాలు  | Vijay Jagarlamudi: Film producer who suffered a heart attack | Sakshi
Sakshi News home page

ఖుదీరామ్‌ కష్టాలు 

Published Sat, Aug 19 2023 12:56 AM | Last Updated on Sat, Aug 19 2023 1:13 AM

Vijay Jagarlamudi: Film producer who suffered a heart attack - Sakshi

భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో అతి చిన్న వయసులో అమరులైన ఖుదీరామ్‌ బోస్‌  జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్‌ బోస్‌’. రాకేష్‌ జాగర్లమూడి టైటిల్‌ రోల్‌లో విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో రజితా విజయ్‌ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో, అలాగే గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యులకు ఈ సినిమాని ప్రదర్శించగా ప్రశంసించారని యూనిట్‌ పేర్కొంది. అయితే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో విజయ్‌ జాగర్లమూడి గుండె పొటుకు గురై, చికిత్స తీసుకుంటున్నారని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement