వారి లిస్ట్‌ తీయండి.. ఫ్యాన్స్‌కు విజయ్‌ అదేశం

Vijay Help Students Tamil Nadu Toppers - Sakshi

కోలీవుడ్‌ హీరో విజయ్ అందరికీ సుపరిచితుడే.తమిళ సూపర్ స్టార్‌గా తిరుగులేని ఫ్యాన్ బేస్‌తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విజయ్‌ ముందుంటారు. గతంలో తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి సాయం చేసేందుకు విజయ్‌ ముందుకొచ్చాడు.

(ఇదీ చదవండి: వరుణ్‌, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!)

 “విజయ్ మక్కల్ ఇ యక్కం” తరపున తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలోని ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈనెల 17వ తేదీన ఆయన సన్మానించనున్నాడు. వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయనున్నాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయంతో విద్యార్థుల సమాచారం సేకరించాలని తన ఫ్యాన్స్‌కు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు.  

(ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top