సత్యసాయి వందో జయంతి సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆయనను స్మరించుకున్నారు. నాకు చిన్నప్పుడు మీరు పెట్టిన విజయ్ సాయి అనే పేరుతోనే ప్రతి రోజు జీవిస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ ప్రపంచానికి దూరంగా మాకు విద్యను, ఎన్నో జ్ఞాపకాలను అందించిన వాతావరణాన్ని కల్పించారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మేమందరం ప్రతిరోజూ మీ గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా మంచి, చెడు సమయాల్లో. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా జీవితాల్లో వచ్చిన మార్పును తెలుసుకున్నాం. ప్రపంచానికి ఇవ్వడానికి మేము చేయగలిగిన విధంగా మాలో శక్తిని నింపారు. మీకు 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు మాతో పాటే ఎప్పటికీ జీవించే ఉంటారు' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
Happy Birthday Swami ❤️
You gave me my name “Vijay Sai” when i was months old - a name that i work to live upto everyday.
You gave us a safe environment, away from the world, where we got our education and made so many memories.
We all always think about you everyday, more so… pic.twitter.com/gTnAltkHiO— Vijay Deverakonda (@TheDeverakonda) November 23, 2025


