విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌.. కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది | Vijay Devarakonda latest Movie Kingdom New Release Date | Sakshi
Sakshi News home page

Kingdom Movie: 'అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్' .. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

Jul 7 2025 7:44 PM | Updated on Jul 7 2025 8:14 PM

Vijay Devarakonda latest Movie Kingdom New Release Date

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ 'కింగ్‌డమ్‌'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.  ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈనెల 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. దీంతో మేకర్స్ మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది.

(ఇది చదవండి: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!)

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీని రివీల్ చేశారు.  జూలై 31న కింగ్ డమ్ విడుదల  కానుందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఈ ‍సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా..  ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement