
ప్రస్తుతం 'ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్న నాని.. జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొన్నాడు. రెండు వారాల క్రితం మొదలైన ఈ షోకి.. నాగార్జున, శ్రీలీల ఇదివరకే వచ్చారు. తమ సరదా సంగతులు చెప్పారు. సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ కోసం నాని వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్)
'మనం మొదటిసారి ఎప్పుడు కలిశాం గుర్తందా నీకు?' అని జగపతిబాబు అడగ్గా.. మీకు గుర్తుందా? అని నాని రిప్లై ఇచ్చాడు. 'దెబ్బతింది నేను కదా.. నాకు గుర్తుంటుంది' అని జగపతిబాబు అనగానే ఆశ్చర్యపోవడం నాని వంతయింది. అలానే చిన్నప్పటి ఫ్రెండ్‌ని కూడా షోకి తీసుకొచ్చి నానిని సర్‌ప్రైజ్ చేశారు. 'నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడు?' అని జగపతిబాబు అనగానే.. నాని గట్టిగా నవ్వేశాడు. ప్రోమోలో ప్రశ్న మాత్రమే చూపించారు. ఎపిసోడ్‌లో దీనికి ఆన్సర్ చూపిస్తారేమో. పూర్తి ఎపిసోడ్ ఈనెల 29న జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది.
ఈ ఏడాది 'హిట్ 3' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నాని.. ప్రస్తుతం 'ప్యారడైజ్' చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జడల్ అనే పాత్రలో నాని కనిపిస్తాడు. కొన్నిరోజుల క్రితం రెండు లుక్స్ రిలీజ్ చేయడంతో పాటు మేకింగ్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మూవీపై గట్టిగానే అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది మార్చి 26న మూవీ రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు.
(ఇదీ చదవండి: విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత)