
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్లో ఫేమస్ అయిన మలయాళ నటుడు వెంకటేశ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ విలన్గా సినీ ప్రేక్షకులను మెప్పించారు. సినిమా రిలీజ్కు ముందే ఈవెంట్లో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ వెంకీ పేరు మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ గురించి పంచుకున్నారు వెంకీ.
కొత్త ఇల్లు అనేది తన కల అని నటుడు వెంకటేశ్ అన్నారు. అమ్మా, నాన్నల కోసం కొత్తింటిని కట్టించాలన్నదే తన చిరకాల స్వప్నమని తెలిపారు. వచ్చేనెలలోనే తన కల నెరవేరనుందని వెంకటేశ్ వెల్లడించారు. కింగ్డమ్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ తనకు ఏ సినిమాకు రాలేదన్నారు. ఇంత పెద్దఎత్తున తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇదేనని వెంకీ ఆనందం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. జూలై 31 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం వంద కోట్లకు చేరువలో ఉంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది.