
హీరోయిన్ సిమ్రాన్ (Simran) ఇండస్ట్రీకి వచ్చి నేటి(ఆగస్టు 25)కి 30 ఏళ్లు పూర్తవుతుంది. హర్‌జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్. బాలీవుడ్‌లో కన్నా సౌత్‌లోనే ఎక్కువ స్టార్‌డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో నేను గుల్మొహర్ అనే సినిమా చేశాను. ఆ మూవీ టీమ్ అంతా కూడా చాలామంచివారు. అదే సమయంలో మరో ప్రాజెక్ట్ కూడా చేశాను. కానీ, అక్కడ ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోయాను.
వీడియో క్లిప్స్ పంపాలా?
పైగా ఇక్కడ పాత్రకు నేను సూట్ అవుతానా? లేదా? అని లుక్ టెస్ట్ చేస్తుంటారు. అందుకు నేను అభ్యంతరమేమీ చెప్పను. ఓకే కానీ, కొందరు నాగురించి తెలియక.. పాత్రకు సరిపోతానో? లేదోనని వీడియో చేసి పంపించమంటారు. అంతేకాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్‌లో పదో వంతు మాత్రమే చెల్లిస్తారు. అందుకే నా గురించి పూర్తిగా తెలుసుకున్నవారి దగ్గరే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.
పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు లేవ్
టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత చిన్న, మధ్య తరహా సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అందులోనూ మహిళా ప్రాధాన్యత ఉన్న స్క్రిప్టులే ఎక్కువ! కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, బడా దర్శకనిర్మాతల నుంచి మాత్రం ఒక్క ఆఫర్ కూడా రాలేదు. నా కెరీర్‌లో చాలా హిట్లు ఉన్నాయి. ఎంతోమంది యంగ్ టాలెంట్ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.
సినిమా
ఈ ఏడాది సిమ్రాన్ ఫుల్ బిజీ. శబ్ధంతో అలరించిన ఆమె గుడ్ బ్యాడ్ అగ్లీలో అతిథి పాత్రలో మెరిసింది. టూరిస్ట్ ఫ్యామిలీతో సూపర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం ద లాస్ట్ వన్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. విక్రమ్ సరసన నటించిన ధ్రువ నక్షత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ.