
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. లెక్క ప్రకారం ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటికీ ప్రమోషన్స్ ఏం మొదలు పెట్టకపోవడంతో వాయిదా గ్యారంటీ అని గత కొన్నిరోజులుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. కొత్త రిలీజ్ తేదీని మూవీ టీమ్ ప్రకటించింది.
'లైగర్', 'ద ఫ్యామిలీ స్టార్' లాంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో ఎలాండి హడావుడి లేకుండా 'కింగ్డమ్' పూర్తి చేశాడు. కొన్నిరోజుల క్రితం ఓ పాట రిలీజ్ చేయగా అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడేమో జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. కానీ రీ రికార్డింగ్ లాంటి కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ వాయిదా అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే జూలై 4న నితిన్ 'తమ్ముడు' కూడా రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితమే ఇది అనౌన్స్ చేశారు. మరి ఇద్దరూ వస్తారా? లేదా ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?
'కింగ్డమ్' మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. నాగవంశీ నిర్మాత. చాన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా. ఇప్పుడు రాబోయేది తొలి పార్ట్ మాత్రమే. హిట్ అయిన దానిబట్టి సీక్వెల్ కూడా ఉండొచ్చు.
(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్)
