Vey Dharuvey Movie Teaser Released By Sai Dharam Tej - Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్‌ తమ్ముడి టీజర్‌ను విడుదల చేసిన సాయితేజ్‌

Feb 16 2023 2:54 PM | Updated on Feb 16 2023 3:25 PM

Veydaruvey Movie Teaser Released By Saidharam Tej - Sakshi

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వెయ్‌ దరువెయ్‌. నవీన్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, దేవరాజ్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ లభిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అన్న కుతూహలం కలుగుతుందన్నారు.

ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక సాయి రామ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. టీజర్‌ను సాయిధరమ్‌ తేజ్‌ రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉందని, ఇప్పటికే తమ సినిమా పాటలు కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయని, యూట్యూబ్‌ ట్రెండ్‌ అయ్యాయని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement