విడుదలై తర్వాత వెట్రిమారన్‌ చేస్తున్న సినిమా ఇదే | vetrimaaran Next Movie With Actor Simbu And Andrea jeremiah | Sakshi
Sakshi News home page

విడుదలై తర్వాత వెట్రిమారన్‌ చేస్తున్న సినిమా ఇదే

Jun 30 2025 7:29 AM | Updated on Jun 30 2025 7:30 AM

vetrimaaran Next Movie With Actor Simbu And Andrea jeremiah

నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్‌. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్‌ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్‌ ఏమిటంటే  నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. 

కాగా ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచెన్నై చిత్రంలో దర్శకుడు అమీర్‌ పోషించిన రాజన్‌ వాగైయరో పాత్రతో కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్‌ వాగైయారో అనే టైటిల్‌ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్‌ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా(Andrea Jeremiah) ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. 

చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే సోషల్‌ పొలిటికల్‌ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్‌ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్‌ చాలా టైట్‌ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement