ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా వస్తున్న మరో వెబ్‌ సిరీస్‌ | Vere Level Office Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా వస్తున్న మరో వెబ్‌ సిరీస్‌

Nov 25 2024 2:36 PM | Updated on Nov 25 2024 3:15 PM

Vere Level Office Official Trailer Out Now

తెలుగు ఓటీటీ సంస్థ ఫన్నీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించింది. ఇప్పటికే పలు కొత్త సినిమాలను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తూనే తన సొంత నిర్మాణంలో పలు వెబ్‌ సిరీస్‌లను ఆహా విడుదల చేస్తుంది. 'వేరే లెవెల్‌ ఆఫీస్‌' పేరుతో ఒక వెబ్‌ సిరీస్‌ను ఆహ తెరెక్కిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే వీడియోను ఆహా విడుదల చేసింది.

కార్పొరేట్ ఆఫీస్ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుందని ఆహా ప్రకటించింది. అయితే, డిసెంబర్‌ 12 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని తన అధికారిక సోషల్‌మీడియాలో పేర్కొంది. ఇదే విషయాన్ని ఒక ఫన్నీ వీడియోతో పంచుకుంది. 'వేరే లెవెల్ ఆఫీస్' వెబ్ సిరీస్ తమిళంలో వచ్చిన 'వెరా మారి ఆఫీస్' సిరీస్‌కు రీమేక్. గతేడాదిలో తమిళ్‌ విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

ఐటీ కంపెనీలో కొందరి స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలతో దీనిని నిర్మించారు. ఫ‌న్‌తో పాటు రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ వంటి అంశాలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లైఫ్ స్టైల్‌కు కనెక్ట్‌ చేస్తూ ఈ సిరీస్‌లో మేక‌ర్స్‌ చూపించారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధ‌క్‌, ఆర్జే కాజల్‌, మ‌హేష్ విట్టాతో పాటు ప‌లువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement