గూఢచారిగా  మారిన ‘వెన్నెల’ కిశోర్‌ | Sakshi
Sakshi News home page

గూఢచారిగా  మారిన ‘వెన్నెల’ కిశోర్‌

Published Fri, Feb 9 2024 12:43 AM

Vennela Kishore Chaari 111 Releasing On March 1st - Sakshi

కన్‌ఫ్యూజ్‌ అయ్యే గూఢచారిగా చారి పాత్రలో నటించారు ‘వెన్నెల’ కిశోర్‌. ఆయన హీరోగా నటించిన ‘చారి 111’ స్పై థ్రిల్లర్‌ మూవీకి టీజీ కీర్తీ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటించగా, మురళీ శర్మ ఓ ప్రధాన పాత్రలో నటించారు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితీ సోనీ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ గురువారం వెల్లడించింది.

‘‘ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌. సిల్లీ మిస్టేక్స్‌ చేసే ఓ స్పై ఒక పెద్ద కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్రకథ. ‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా స్పై రోల్స్‌ చేయగా, వీరి బాస్‌ పాత్రలో మురళీ శర్మ నటించారు’’ అన్నారు టీజీ కీర్తీ కుమార్‌. ‘‘చారి 111’ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు అదితీ  సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్‌.

Advertisement
 
Advertisement