వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్‌తో పాటు ఇతర నటీనటులపై ఇప్పటికే ఒక పాట చిత్రీకరించారు.
తాజా షెడ్యూల్‌లో కల్యాణ్ రామ్, కీర్తీ సురేష్, కృతి శెట్టి పాల్గొంటుండగా వెంకటేష్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సందడి సందడిగా షూటింగ్ జరుగుతోంది. ‘‘భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి. వెంకటేష్, కీర్తి సురేష్, కల్యాణ్ రామ్, కృతి శెట్టి పాల్గొంటున్నారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సీన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ అనుబంధం అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి చక్కగా సరిపోతుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.


