ఆగస్టులో వేగ లీలా | Vega Leela First Look Out: Grand Release Planned for August 2026 | Sakshi
Sakshi News home page

ఆగస్టులో వేగ లీలా

Apr 7 2026 12:04 AM | Updated on Apr 7 2026 12:04 AM

Vega Leela First Look Out: Grand Release Planned for August 2026

విశ్వనాథ్‌

ఘంటసాల నాగ విశ్వనాథ్‌ దర్శకత్వంలో సాయి కుమార్‌ మేడి, జయ వేణుబాబు నిర్మిస్తున్న చిత్రం ‘వేగ లీలా’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అయితే నటీనటుల పేర్లు, వారి ముఖాలను ఇప్పుడు రివీల్‌ చేయడంలేదని, సస్పెన్స్‌ అని చిత్రబృందం పేర్కొంది.

ఆగస్టులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వేగ లీలా’లోని నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. జీవీ, పవన్‌ చరణ్‌ ఈ సినిమాకి మంచి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడు దిలీప్‌ కుమార్‌ చిన్నయ్య విజువల్స్‌ క్యాచీగా ఉంటాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement