చిరంజీవి ఎత్తుకున్న పాపను గుర్తుపట్టారా?

Varun Tej Shares Childhood Pic With Chiranjeevi - Sakshi

ఇద్దరు పిల్లలను ఆడిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి ఫొటో ఎంతో క్యూట్‌గా ఉంది కదూ.. కానీ ఇప్పుడా ఇద్దరు పిల్లలు చిరు గర్వించే స్థాయికి ఎదిగారు. ఇద్దరూ సినీరంగాన్నే ఎంచుకుని అక్కడా సత్తా చాటుతున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది ఎవరో మీరు గుర్తుపట్టారా? చిరంజీవిని వెనక నుంచి హత్తుకున్నట్లు కనిపిస్తున్న బాలుడు మరెవరో కాదు మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు హీరో వరుణ్‌తేజ్‌. ఇక చిరు భుజాన ఎక్కి ఆడుకుంటున్న చిన్నారి నిహారిక కొణిదెల. పెదనాన్న తమతో సరదాగా ఆడుకున్న ఫొటోలను వరుణ్‌ తేజ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ఈ పిక్‌ చూసిన నెటిజన్లు చిన్నప్పటి నుంచే ఇంత క్యూట్‌గా ఉన్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిహారిక ఈ మధ్యే పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన తమిళ చిత్రం 'ఒరు నల్లనాళ్‌ పొత్తు సొల్రేన్‌' తెలుగులో 'ఓ మంచి రోజు చూసి చెప్తా' పేరుతో నేడు(ఏప్రిల్‌ 2న) రిలీజైంది. ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇక వరుణ్‌ తేజ్‌ విషయానికొస్తే.. 'గని' సినిమా కోసం అతడు బాక్సర్‌ అవతారమెత్తాడు. ఈ సినిమా జూలై 30న రిలీజ్‌ కానుంది. అలాగే అతడి 'ఎఫ్‌ 3' సినిమా ఆగస్టు 27న విడుదలవుతోంది. మరోవైపు 'పీఎస్‌వీ గరుడవేగ' ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. 

చదవండి: నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య

అతడితో పెళ్లి రద్దు చేసుకున్న నటి‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top