
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఈ వార్తలపై అటు వరుణ్ కానీ, లావణ్య కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఒకే బర్త్‌డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి సహా నితిన్ ఆయన భార్య షాలినీ, సాయి ధరమ్ తేజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యరు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.