Varun Tej Interesting Comments On Marriage Date With Lavanya Tripathi - Sakshi
Sakshi News home page

Varun Tej :పెళ్లి తేదీపై ఆసక్తికర కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్!

Aug 18 2023 9:29 PM | Updated on Aug 19 2023 9:53 AM

Varun Tej Interesting Comments On Marriage Date With Lavanya Tripathi - Sakshi

త్వరలోనే మెగా ఇంట్లో సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  దాదాపు ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

(ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!)

అయితే ఇప్పటికే పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.  ఈనేపథ్యంలోనే ఓ ఇంటర్వ‍్యూకు హాజరైన వరుణ్ తన పెళ్లి తేదీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

వరుణ్ మాట్లాడుతూ... 'ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. ఈ ఏడాదిలోనే చేసుకుంటా. మా అమ్మ ఇంకా తేదీ ఖరారు చేయలేదు.   పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయం. అంతే కాకుండా తేదీ ఓకే అయ్యాక వేదిక ఎక్కడనేది ఫిక్స్ చేస్తాం. నెక్ట్స్ మూవీ కోసం వెయిటింగ్. కానీ పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక సినిమాపై ప్లాన్ చేస్తా. డెస్టినేషనా లేదా అనేది ఫ్యామిలీతో డిసైడ్ చేస్తాం. లవ్ ప్రోపోజ్‌పై ప్రశ్నించగా.. ముందు తానే ప్రపోజల్ పెట్టింది. '  అని అన్నారు.  మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.  కాగా.. ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కించిన ‘గాండీవధారి అర్జున’ ఈ నెల  25న విడుదల కానుంది.  వరుణ్‌ తేజ్‌కు జంటగా సాక్షీ వైద్య నటించింది.  

(ఇది చదవండి: ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు.. కానీ: రమ్యకృష్ణ)

Advertisement
 
Advertisement
Advertisement