ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా "హలో ఇట్స్ మీ". ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. షగ్నశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో లాంఛ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్ గా ఈమూవీలో చూపించింది. ఆమె స్టోరీ నెక్ట్స్ లెవెల్ లో చెప్పింది. అప్పుడే డైరెక్టర్ గా ఆమెను నమ్మాను. షగ్న తప్పకుండా మంచి సినిమా చేస్తుందని నమ్మకంతో చేశాను. నా మూవీస్ కొత్తబంగారు లోకం, హ్యాపీడేస్ సాంగ్స్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఆడియెను మిస్ అవుతున్నాను అనుకున్నాను. ఈ చిత్రంలోని పాటలతో ఆ కొరత తీరనుంది. ఈ మూవీ సాంగ్స్ ను కొన్నేళ్ల వరకు వింటూనే ఉంటారు. వంశీకాంత్ అంతమంచి ఆడియో ఇచ్చారు. ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ సందీప్, సంజీవ్, సంకీర్త్ లకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలి. అన్నారు.
హీరోయిన్, డైరెక్టర్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ - డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా. మంచి కథా కథనాలతో సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. యూత్ అంతా మా చిత్రానికి కనెక్ట్ అవుతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు హీరోయిన్ దర్శకత్వంలో సినిమా ఎందుకని నెగిటివ్ గా మాట్లాడారు. మా ప్రొడ్యూసర్స్ నాపై నమ్మకం ఉంచి, ఎవరి సందేహాలు వినకుండా సినిమా చేశారు. సినిమాను దర్శకత్వం చేయడంలో ఆడా, మగా తేడా ఏం లేదు. మనం అనుకున్న సీన్ అనుకున్నట్లు రూపొందించామా లేదా అనేది కావాలి. అందుకు టీమ్ అంతా సపోర్ట్ చేయాలి. నాకు అలాంటి మంచి సపోర్టింగ్ టీమ్ దొరికింది. వరుణ్ ఎంతో సపోర్ట్ చేశారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజశేఖర్, జశ్వంత్, సంగీత దర్శకుడు వంశీకాంత్, డీవోపీ బ్రహ్మతేజ మురిపూడి, నిర్మాత సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


