వరలక్ష్మీ శరత్ కుమార్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ | Varalaxmi Sarathkumar Upcoming Film Update | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ శరత్ కుమార్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్‌

Jan 29 2025 4:29 PM | Updated on Jan 29 2025 4:45 PM

Varalaxmi Sarathkumar Upcoming Film Update

ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ(Varalaxmi Sarathkumar ).. తనదైన నటనతో సౌత్‌ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు కీలక పాత్రలు పోషించి సౌత్‌ ఇండియాలో విలక్షణ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనూ ఈమె మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. గతేడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ చిత్రంలో వరలక్ష్మీ పోషించిన పాత్రకు మంచి  స్పందన వచ్చింది. 

ఆ మూవీ రిలీజ్‌ తర్వాత ఆమెకు ఇక్కడ వరుస సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ విలక్షణ నటి చేతికి భారీ ప్రాజెక్ట్‌ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఆదిపర్వం' మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ద‌ర్శ‌త్వంలో వరలక్ష్మీ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు సమాచారం.   సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ స‌బ్జెక్టు కోసం వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయ‌నుంది.

భారీ బ‌డ్జెట్‌తో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులను తీసుకోబోతున్నార‌ట‌. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా సంజీవ్ మేగోటి తెర‌కెక్కించ‌నున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Advertisement
 
Advertisement
Advertisement