న‌టి వ‌నితా విజ‌య్‌కుమార్ ఇంట విషాదం | Vanitha Vijayakumar Gets Emotional After Her Niece Anitha Passed Away | Sakshi
Sakshi News home page

Vanitha Vijayakumar: నా గుండె బ‌ద్ధ‌లైంది, మాట‌లు రావ‌డం లేదు

Oct 15 2021 9:52 AM | Updated on Oct 16 2021 9:04 PM

Vanitha Vijayakumar Gets Emotional After Her Niece Anitha Passed Away - Sakshi

న‌న్ను, నా పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటాన‌ని మాటిచ్చింది. కానీ ఇలా మ‌మ్మ‌ల్ని అర్ధాంత‌రంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది.. నిన్ను ఎప్ప‌టికీ మిస్ అవుతూనే ఉంటా స్వీట్ హార్ట్‌...

వివాదాస్ప‌ద న‌టి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వ‌నితా విజ‌య్‌కుమార్ ఇంట విషాదం నెల‌కొంది. త‌న అక్క కూతురు అనిత గుండెపోటుతో మ‌ర‌ణించింది. ఈ విషాద వార్త‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్న వ‌నిత ఎమోష‌న‌ల్ లేఖ‌ను పోస్ట్ చేసింది. 'విషాద‌క‌ర వార్తతో ఉద‌యం నిద్ర లేచాను. నా అక్క కూతురు అనిత(20) మ‌ర‌ణించింది. న్యూఢిల్లీలో స‌ర్జ‌రీ చేసుకున్న త‌ర్వాత గుండెపోటు రావ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె నాకు దేవుడిచ్చిన కూతురులాంటిది, నాకు పెద్ద‌కూతురు వంటిది. మా నాన్న సోద‌రుడి కూతురు ఇంద్ర‌.. ఆమె సింగ‌పూర్‌లో ఉంటుంది. ఇంద్ర‌ చిన్న కూతురే అనిత‌. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అంద‌రికీ ఎంతో ఇష్టం. ఆమె కూతురు అనిత ఎంతో ద‌యాగుణం క‌లిగి ఉండేది. అన్నింటినీ ఎంతో బాగా అర్థం చేసుకునేది. ఎప్పుడూ నాకు మ‌ద్దతుగా నిల‌బ‌డేది.

న‌న్ను, నా పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటాన‌ని మాటిచ్చింది. కానీ ఇలా మ‌మ్మ‌ల్ని అర్ధాంత‌రంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె పేరెంట్స్ సింగ‌పూర్‌లో ఉండ‌టంతో త‌న మృత‌దేహాన్ని కూడా అక్క‌డికే తర‌లించారు. ప్ర‌స్తుతం నేను దుబాయ్‌లో ఉన్నాను. ఇలా జ‌రుగుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. నిజానికి ఈ అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో మేమిద్ద‌రం క‌లుద్దాం అనుకున్నాం. త‌న‌ను నాద‌గ్గ‌రే 2 నెల‌లు ఉంచేసుకుందామ‌నుకున్నా. కోవిడ్‌, లాక్‌డౌన్ కంటే ముందుగా గ‌త రెండేళ్ల నుంచి క‌లుద్దామ‌ని ప్లాన్ చేస్తున్నాం, కానీ అంత‌లోనే ఇలా జ‌రిగిపోయింది. నా హృదయం ముక్క‌లైంది. మాటలు రావ‌డం లేదు. ఇప్ప‌టికీ దీన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాను.

ఈ ఏడాది న‌వ‌రాత్రి ఉత్స‌వాలు కూడా జ‌రుపుకోవ‌డం లేదు. కానీ కొంద‌రు ఇలాంటి విషాదాల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి చీర‌లు, న‌గ‌లు కొనుక్కుంటూ పండ‌గ సెల‌బ్రేట్ చేసుకుంటూ నీచంగా ప్ర‌వ‌ర్తిస్తారు. అదృష్టవశాత్తు మా కుటుంబంలో అలాంటి వారు ఎవ‌రూ లేరు. అనిత మాకు ల‌క్ష్మీదేవి వంటిది. రెండేళ్లుగా క‌లుద్దామ‌ని ప్లాన్లు వేసుకున్నాం కానీ క‌నీసం హాయ్‌, బాయ్ కూడా చెప్పుకోలేదు. నిన్ను ఎప్ప‌టికీ మిస్ అవుతూనే ఉంటా స్వీట్ హార్ట్‌. అత‌న్‌, అంజ‌న కోస‌మైనా ఇంద్ర అక్క స్ట్రాంగ్‌గా ఉండాలి. నా డార్లింగ్ అనిత ఎప్ప‌టికీ నా కూతురే..' అని భావోద్వేగానికి లోనైంది వ‌నిత‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement