నటుడితో సంబంధం అంటగట్టారు.. సెట్‌లో ఏడ్చేశా.. హీరో విజయ్‌..: వనిత | Vanitha Vijayakumar About Vijay Advice on Chandra lekha Movie Set | Sakshi
Sakshi News home page

Vanitha Vijayakumar: ఆ నటుడితో లింక్‌.. సెట్‌లో ఏడ్చేశా.. విజయ్‌ మొదట చూడనట్లే వెళ్లిపోయాడు

Jul 2 2025 4:55 PM | Updated on Jul 2 2025 5:44 PM

Vanitha Vijayakumar About Vijay Advice on Chandra lekha Movie Set

చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు వనిత (Vanitha Vijayakumar). తల్లిదండ్రులు మంజుల- విజయ్‌ కుమార్‌ల నుంచి నటనను పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో దేవి చిత్రంలో నటించారు. ఆ మధ్య వచ్చిన మళ్లీ పెళ్లి మూవీలోనూ యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకురాలిగానూ బాధ్యతలు చేపట్టింది.

సెట్‌లో ఏడ్చేశా..
ఈ మూవీతో వనిత కూతురు జోవిక నిర్మాతగా పరిచయం కానుంది. జూలై 11న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో వనితా విజయ్‌కుమార్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రలేఖ సినిమాతో హీరోయిన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇందులో విజయ్‌ (Vijay) హీరో. ఆ సినిమా చేస్తున్నప్పుడు నా వయసు దాదాపు 15 ఏళ్లుంటాయనుకుంటా.. 40 ఏళ్ల వయసున్న రాజ్‌కిరణ్‌తో నాకు ముడిపెట్టి చేసి వార్తలు రాశారు. అవి చూసి తట్టుకోలేకపోయాను. సెట్‌లోనే ఏడ్చేశాను.

మొదట పలకరించలేదు
అప్పుడు విజయ్‌ నన్ను చూసి పలకరించకుండానే వెళ్లిపోయాడు. తర్వాత కొంతసేపటికి వచ్చి అసలేమైందని అడిగాడు. నేనుం ఏం కాలేదని చెప్పాను. పర్వాలేదు, ఏం జరిగిందో చెప్పు అనేసరికి నా బాధనంతా వెళ్లగక్కాను. ఓ నటుడితో నాకు రిలేషన్‌ అంటగడుతున్నారని, అందుకు బాధగా ఉందని చెప్పాను. అప్పుడు విజయ్‌.. నీ గురించి వాళ్లు ఏదీ రాయకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే! నీ గురించి ఏదో ఒకటి రాస్తున్నారంటే నువ్వు ఫేమస్‌ అయ్యావని అర్థం. 

ఓదార్చాడు
ఈ విమర్శలు, పుకార్ల గురించి బాధపడకు. నీ నెక్స్ట్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టు అని సలహా ఇచ్చాడు. విజయ్‌ ఎప్పుడూ అంతే.. మొదట నేను ఏడుస్తున్నా నా దగ్గరకు కూడా రాలేదు. అసలేమైందని కనుక్కున్న తర్వాతే నా దగ్గరకు వచ్చి పలకరించాడు, నా సమస్యను పరిష్కరించాడు. ఇకపోతే రాజ్‌కిరణ్‌ సర్‌ చాలా మంచివాడు. అలాంటి మనిషి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. నాతో సంబంధం అంటగట్టారు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను అని  వనిత విజయ్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు.

చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement