Tollywood Love Breakups: టాలీవుడ్‌ సెలబ్రిటీల బ్రేకప్‌ లిస్ట్‌ పెద్దగానే ఉందే..

Valentines Day: These Tollywood Celebrity Couples Who Broke Up After Love - Sakshi

'నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా..', 'ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..', 'నువ్వూనేను జంట.. టాక్‌ ఆఫ్‌ ద టౌను అంట..', 'అహ నా పెళ్లి అంట, ఓహొ నా పెళ్లి అంట.. నీకునాకు పెళ్లంట టాంటాంటాం..', 'ఏకాకై వెళుతున్నా.. పిలవద్దే పోమ్మాపో..' ఈ ఐదు పాటలతో ఏం చెప్పబోతున్నామో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ లాగా కొందరు తొలిచూపులోనే లవ్‌లో పడతారు. మరికొందరు అవతలి వారి చూపుల్లో, మాటల్లో మ్యాజిక్‌ వెతుక్కుని మరీ ప్రేమలో పడిపోతుంటారు. ఆ కొంటెచూపులు, ప్రేమవలపులు బానే ఉంటాయేమో కానీ అటుపక్కవారిని ఒప్పించాలిగా.

ప్రేమ అనే పరీక్షలో కొందరు ఈజీగా మరికొందరు ఆలస్యంగా పాస్‌ అవుతుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఫెయిల్‌ అవుతుంటారు. ఆ తర్వాత వారు నిద్రలోనూ ఒకరిగురించి ఒకరు కలవరించడం మొదలవుతుంది. పెళ్లి అంటూ నెక్స్ట్‌ స్టెప్‌ తీసుకుంటారు. ఇంతలోనే కొందరికి అది ప్రేమ కాదని అర్థమై బ్రేకప్‌ చెప్పుకుంటారు. మరికొందరు ఎంగేజ్‌మెంట్‌ దాకా వెళ్లి మరీ దాన్ని క్యాన్సిల్‌ చేసుకుంటారు. సినీపరిశ్రమలో లవ్‌ బ్రేకప్‌, ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్న తారలెవరో ఓసారి చూసేద్దాం..

రష్మిక మందన్నా
నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. కిరిక్‌ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కానీ ఏడడుగులు వేసేలోపే ఎవరిదారి వారు చూసుకున్నారు.

మెహరీన్‌
హీరోయిన్‌ మెహరీన్‌ యువ రాజకీయ నాయకుడు భవ్య భిష్ణోయ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాక ఫోటోషూట్లు కూడా చేసుకున్నారు. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కానీ అంతలోనే అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లి క్యాన్సిల్‌ అయింది.

అఖిల్‌
అక్కినేని అఖిల్‌ శ్రియ భూపాల్‌ను ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక తాము అడ్డు చెప్పేదేముందనుకున్న పెద్దలు పెళ్లి చేస్తామన్నారు. ఎంతో వైభవంగా నిశ్చితార్థం కూడా జరిపారు. కానీ వీరి పెళ్లి కూడా మధ్యలోనే ఆగిపోయింది.

త్రిష
హీరోయిన్‌ త్రిష వ్యాపారవేత్త వరుణ్‌ మానియన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేశారు. కానీ పెళ్లికి ముందే ఇద్దరూ విడిపోయారు.

నయనతార మొదట శింబుతో తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిందంటూ ప్రచారం జరిగింది. కానీ తర్వాత విఘ్నేశ్‌ శివన్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇలియానా ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూతో బ్రేకప్‌ చెప్పింది. మరోవైపు సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ విడిపోయారు. మంచు మనోజ్‌- ప్రణతి వివాహబంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. అల్లు శిరీష్‌, అడివి శేష్‌, సందీప్‌ కిషన్‌, విశ్వక్‌సేన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్‌ బ్రేకప్‌ అయినవాళ్లు చాలామందే ఉన్నారు!

చదవండి: నాన్న చివరి కోరిక నెరవేర్చే క్రమంలో అమ్మ చనిపోయింది: ఘంటసాల తనయుడు

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top