ఆదికేశవ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..? | Vaishnav Tej Aadikeshava Movie Likely To Release In OTT Platform Netflix On Christmas 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

Aadikeshava Movie In OTT: ఆదికేశవ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..?

Published Mon, Nov 27 2023 10:21 AM

Vaishnav Tej Adikesava In Netflix Streaming On Christmas - Sakshi

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ - శ్రీలీల నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్‌ 24న విడుదలైంది. పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటిరోజే డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. తొలి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చిన వైష్ణవ్‌ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాలు డిజాస్టర్‌గానే మిగిలాయి. తాజాగా విడుదలైన ఆదికేశవ కూడా డిజాస్టర్‌గానే మిగిలే ఛాన్స్‌ ఉంది.

సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన ఆదికేశవకు ప్రేక్షకుల ఆధరణ అంతగా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం నష్టాల దిశగా ఈ చిత్రం ఉంది. ఇలాంటి సమయంలో ఆదికేశవ ఓటీటీ విడుదలపై ఒక ప్రచారం జరుగుతుంది. డిసెంబర్‌ నెలలో క్రిస్టమస్‌ కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఆదికేశవ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు  శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి. ఈ చిత్రంలో ఎక్కువగా వయొలెన్స్‌తో పాటు ఎమోషన్‌ సీన్లు కూడా  ఎక్కువగానే ఉన్నాయి. కానీ అవి అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదని చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాత్రం ఓకే అనిపించినా.. ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. అలా ఫైనల్‌గా వైష్ణవ్‌ తేజ్‌ లిస్ట్‌లో మరో డిజాస్టర్‌గా  ఈ చిత్రం మిగిలింది. మరి ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తోంది చూడాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement