Vaadu Veedu Movie Censor Completed Details Inside - Sakshi
Sakshi News home page

Vaadu Veedu Movie: సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘వాడు ఎవడు’

Sep 3 2022 3:02 PM | Updated on Sep 3 2022 5:30 PM

Vaadu Veedu Movie Censor Completed - Sakshi

కార్తికేయ, శివయువన్‌, అఖిల నాయర్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాడు ఎవడు’.  రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఎన్నో వైవిధ్యమైన ఉత్కంఠమైన సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్ళు యూఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. త్వరలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.ఇలాంటి విభిన్న సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది’ అన్నారు.  రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, డి టి నాయుడు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రమోద్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement